
నేను మరొకరికి గాయం కలిగించక ముందే..
● గుంతల రహదారిపై వినూత్న హెచ్చరిక బోర్డులు
● అధ్వానంగా ద్వారకాతిరుమల క్షేత్ర రహదారి
ద్వారకాతిరుమల : ‘నెమ్మదిగా వెళ్లండి.. నేను కు టుంబాలతో ప్రయాణించే వ్యక్తులను గాయపరుస్తున్నాను. నేను మరొకరికి గాయం కలిగించక ముందే దయచేసి నన్ను త్వరగా మరమ్మతులు చేయండి’ అంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టుగా ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డులు భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారి దుస్థితికి అద్దం పడుతున్నాయి. భారీ గోతులతో ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారిపై ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా అధికారులు గుంతల్లో మెటల్ డస్ట్ పోయించారు. అయితే రెండు రోజులకే రోడ్డు యథాస్థితికి చేరుకుంది. నిత్యం వందలాది వాహనాలు ఇటుగా ప్రయాణిస్తున్నా పూర్తిస్థాయిలో మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు పై వ్యాఖ్యలతో ఉన్న ఇంగ్లిష్ హెచ్చరిక బోర్డులను రహదారిపై పలుచోట్ల ఏర్పాటుచేశారు. బోర్డుల చుట్టూ పసుపు రంగు రేడియం స్టిక్లర్లు కూడా అతికించారు. ఇటుగా వెళుతున్న వాహనచోదకులు ఆగి మరీ బోర్డులను చదివి జాగ్రత్తగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలని పలువురు కోరుతున్నారు.

నేను మరొకరికి గాయం కలిగించక ముందే..