
ఉపాధి హామీలో ప్రభుత్వ చర్యలు విడ్డూరం
భీమవరం: ఉపాధి హామీలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. ఏపీ వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా 33వ మహాసభల కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి హామీలో ఈకేవైసీ ఆధార్ అనుసంధానం పైలెట్ ప్రాజెక్టుగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభించారని, అయితే ఎన్‌ఎంఎంఎస్ యాప్ వల్ల ఇబ్బందులు పడుతున్న ఉపాధి కూలీలకు ఈకేవైసీ విధానం మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిధులు, పని దినాలు, వేతనాలు, సౌకర్యాలు పెంచాలన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం 33వ మహాసభ నవంబర్ 10, 11వ తేదీల్లో అత్తిలిలో నిర్వహించనున్నామన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కవురు పెద్దిరాజు, కండెల్లి సోమరాజు, జె.వెంకటలక్ష్మి, సహాయ కార్యదర్శులు బల్ల చిన వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.