
మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
తాడేపల్లిగూడెం అర్బన్ : తాడేపల్లిగూడెం మున్సిపాల్టీలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న పూనకం మునియ్య కలుపు మందు తాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వార్డు శానిటరీ సెక్రటరీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ తనను వేధిస్తున్నారని వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు తెలిపాడు. మునియ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పెదపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలైన సంఘటన కలపర్రు టోల్‌గేట్ సమీపంలోని బాపులపాడు మండలం బొమ్ములూరులో పరిధిలో చోటు చేసుకుంది. బాపులపాడు హనుమాన్ జంక్షన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి నుంచి విజయవాడకు ఆటోలో 8 మంది బయలు దేరారు. కలపర్రు టోల్ గేట్ దాటి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలోకి వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి స్వల్ప గాయాలు కాగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు.

మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్యాయత్నం