
చిన్నతిరుపతి క్షేత్రం.. భక్తజన సంద్రం
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ దసరా సెలవులు ముగియడంతో ఊళ్లకు వెళ్తున్న వారు, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఇరుముడులు సమర్పించిన భవానీ భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. దాంతో తెల్లవారుజాము నుంచి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట, అన్నదాన విభాగాల వద్ద భక్తులు పోటెత్తారు. కొండపై, అలాగే కొండ కింద గుడి సెంటర్‌లో ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. రాత్రి వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. పలు భజనల మండలి సభ్యులు అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

చిన్నతిరుపతి క్షేత్రం.. భక్తజన సంద్రం