
మహిళల కబడ్డీ విజేత శ్రీకాకుళం
హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
తణుకులో తాడేపల్లిగూడేనికి చెందిన యువకుడి అదృశ్యం ఆపై హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 8లో u
పురుషుల విజేత తూర్పుగోదావరి
నూజివీడు: దసరా సందర్భంగా నూజివీడులో నిర్వహిస్తున్న 73వ అఖిలభారత పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. మహిళల కబడ్డీ విజేతగా శ్రీకాకుళం జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ శ్రీకాకుళం–చిత్తూరు జట్ల మధ్య జరగ్గా చిత్తూరు జట్టుపై 40–29 స్కోర్‌తో శ్రీకాకుళం జట్టు గెలుపొందింది. చిత్తూరు జట్టు ద్వితీయస్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల ఫైనల్ మ్యాచ్ గుంటూరు–తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగింది. తూర్పుగోదావరి జట్టు 59–39 స్కోర్ తేడాతో గుంటూరు జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది. విజేతలకు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నగదు బహుమతులను, ట్రోఫీలను అందజేశారు.
ఆటలకు నిలయం నూజివీడు:
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడులో పూర్వకాలం నుంచి ఆటలకు గొప్ప పేరుందని అన్నారు. ఆటలు, క్రీడలకు నూజివీడులో లభించే ప్రోత్సాహం జిల్లా లో మరెక్కడా లభించదన్నారు. ప్రతిఒక్కరూ క్రీడలను ప్రోత్సాహించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు ఆటల గురించి తెలియజేయడంతో పాటు ఆడుకునేలా అవకాశం కల్పించాలన్నారు. క్రీడల్లో ప్రతిభను కనబరిస్తే నలుదిశలా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయన్నారు. స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు రామిశెట్టి మురళీకృష్ణ, సెక్రటరీ టీవీ కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ మల్లెపూడి రాజశేఖర్, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కోటగిరి సతీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.