
బాలిక అప్పగింత
నరసాపురం రూరల్: పేరుపాలెం బీచ్‌లో తప్పిపోయిన బాలికను మొగల్తూరు పోలీసులు గంట వ్య వధిలో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్టు శ నివారం ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఓ ప్రకటనలో తెలిపారు. భీమవరానికి చెందిన ఓ కుటుంబం తమ ఎనిమిదేళ్ల బాలిక తప్పిపోయిందంటూ సా యంత్రం 4 గంటలకు బీచ్ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన అవు ట్ పోస్ట్ పోలీసులు బాలిక ఆచూకీ గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు. బీచ్‌కు వచ్చే సందర్శకులు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని, తక్షణ సహాయం కోసం పోలీసులను సంప్రదించాలని సూచించారు.