ఎరుపెక్కిన శ్రీవారి క్షేత్రం | - | Sakshi
Sakshi News home page

ఎరుపెక్కిన శ్రీవారి క్షేత్రం

Oct 4 2025 2:00 AM | Updated on Oct 4 2025 2:00 AM

ఎరుపెక్కిన శ్రీవారి క్షేత్రం

ఎరుపెక్కిన శ్రీవారి క్షేత్రం

ఎరుపెక్కిన శ్రీవారి క్షేత్రం అత్యాచారం కేసులో వ్యక్తికి జైలు తగ్గుతున్న గోదావరి వరద వైద్యుల డిమాండ్లు పరిష్కరించాలి గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శుక్రవారం భవానీ దీక్షాదారులతో ఎరుపెక్కింది. దేవీ శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులంతా ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంటున్నారు. దాంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ పరిసరాలు భవానీలు, సాధారణ భక్తులతో కిక్కిరిశాయి. దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, పరిసర ప్రాంతాలు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. కొండపై ఎక్కడ చూసినా భవానీ దీక్షాధారులే కనిపించారు.

టి.నరసాపురం: దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో ఒక వ్యక్తికి జిల్లా 5వ అడిషనల్‌ డిస్ట్రిక్‌, సెషన్స్‌ జడ్జ్‌ శుక్రవారం జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. మండలంలోని కె.జగ్గవరానికి చెందిన దివ్యాంగురాలు 2018 మార్చి 21న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రా మానికి చెందిన కుమ్మరి రమేష్‌ అత్యాచారం చేసి గాయపరిచాడన్నారు. దీంతో దివ్యాంగురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. అప్పటి ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేయగా, చింతలపూడి సీఐ పి.రాజేష్‌ దర్యాప్తు చేసి రమేష్‌ను అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో 10 సంవత్సరాలు జైలు, రూ. 500 జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు.

పోలవరం రూరల్‌: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే నీరు క్రమేపీ తగ్గుతుండటంతో వరద ఉధృతి తగ్గుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.720 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా వరద బాగా తగ్గింది. 36.90 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.

వేలేరుపాడు: ఏజెన్సీలో సేవలందిస్తున్న వైద్యుల డిమాండ్లు పరిష్కరించాలని ఆదివాసీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాద్యక్షుడు మిడియం సువర్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు డిమాండ్‌ చేశారు. గత నెల 25 నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులకు ఇన్‌ సర్వీస్‌లో ఉన్న వారికి పీజీ కోటా సీట్లు క్లినికల్‌ 30 శాతం నుంచి 15 శాతం, నాన్‌ క్లినికల్‌ కోటాలో 50 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించారన్నారు.

పెదవేగి: పెదవేగి మండలం ముండూరు శివారులోని పోలవరం కాలువలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. వెంటనే పెదవేగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పెదవేగి ఎస్సై రామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆమె వయసు 60 నుంచి 70 సంవత్సరాలు మధ్య ఉంటుందని వివరాలు తెలిసినవారు పెదవేగి ఎస్సై 9440796638 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement