
గజలక్ష్మి భయపెట్టింది
ద్వారకాతిరుమల: శ్రీవారి గ్రామోత్సవం జరుగుతున్న సమయంలో గుర్రం దగ్గరకు వెళ్లడంతో దాని నీడచూసి భయపడిన దేవస్థానం ఏనుగు గజలక్ష్మి ఒక్కసారిగా అడ్డం తిరిగింది. దాంతో వాద్యకారులు, భక్తులు భయంతో రోడ్డుపై పరుగులు తీశారు. దేవస్థానం ఆటోను అడ్డు పెట్టడంతో గజలక్ష్మి నిలిచిపోయింది. దాంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి సెమీ పూజ నిమిత్తం దసరా మండపం వద్దకు గురువారం రాత్రి తరలి వెళుతున్నారు. గుడి సెంటర్ దాటిన తరువాత అశ్వం దగ్గరకు వెళ్లడంతో దాని నీడను చూసి గజలక్ష్మి కంగారుపడింది.