
రక్త పరీక్షలు విధిగా చేపట్టాలి
చిత్తూరు రూరల్(కాణిపాకం): సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ విధిగా రక్త పరీక్షలు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూ రులోని తన కార్యాలయంలో శనివారం ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో జ్వరాల కేసులు అధికమయ్యాయని, వర్షా ల కారణంగా విష జ్వరాలు పెరుగుతున్నాయన్నా రు. ఇలాంటి తరుణంలో ల్యాబ్ టెక్నీషియన్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. విధులకు డుమ్మా కొడితే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, డీఐఓ హనుమంతరావు, డీపీఎంఓ ప్రవీణ పాల్గొన్నారు.