
తప్పు చేసేవారికి శిక్ష ఖాయం
కుప్పం: అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడేవారికి శిక్ష తప్పదని ఎమ్మెల్సీ భరత్ హెచ్చరించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ సీపీ డిజిటల్ డైరీ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, భవిష్యత్‌లో ఇలాంటి వారికి చట్టం శిక్షింస్తుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ కార్యకర్త కోసం డిజిటల్ డైరీతో పాటు క్యూర్ కోడ్ సిస్టంమ్‌ను ప్రారంభించినట్టు వెల్లడించారు. దీని ద్వారా కార్యకర్తులు కూటమి ప్రభుత్వంతో జరుగుతున్న అక్రమాలు గురించి అధిష్టానం దృష్టి తీసుకెళ్లవచ్చన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తులు పాల్గొన్నారు.