క్వారీ..వసూళ్ల సవారీ! | - | Sakshi
Sakshi News home page

క్వారీ..వసూళ్ల సవారీ!

Oct 7 2025 3:39 AM | Updated on Oct 7 2025 3:39 AM

క్వారీ..వసూళ్ల సవారీ!

క్వారీ..వసూళ్ల సవారీ!

ముగిసిన రాయల్టీ టెండర్ల గడువు మైనింగ్‌శాఖకు రాయల్టీ వసూళ్ల పగ్గాలు జోరందుకున్న దందా యూనియన్‌ పేరుతో రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు కొమ్ముకాస్తున్న అధికారులు కొలిక్కిరాని కొత్త టెండర్ల ప్రక్రియ

అడ్డూఅదుపూ లేదు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: క్వారీలపై వసూల్‌ రాజాలు కన్నేశారు. రాయల్టీ పేరుతో దోచుకోవడం ప్రారంభించారు. దొంగ బిల్లులతో రెచ్చిపోతున్నారు. కాపు కాచి కాసులు కొట్టేస్తున్నారు. యూనియన్‌ పేరుతో అధికారాన్ని అడ్డుపెడుతున్నారు. దీనికితోడు అధికారిక రాయల్టీ వసూళ్ల ప్రక్రియ ముగిసింది. ఆ శాఖకు వసూళ్ల పగ్గాలు దక్కాయి. దీంతో అడ్డూ అదుపు లేకుండా మాఫియా వసూళ్లకు తెగబడుతోంది. ఈ అక్రమాలకు ఆ శాఖలోని కొందరు కొమ్ము కాస్తూరనే విమర్శలు వస్తున్నాయి.

ఇది ఇంతేనా?

బంగారుపాళ్యం మండలం, పాలేరు ప్రాంతంలో గ్రానైట్‌ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విలువైనా ఖనిజం బయట పడడంతో జోరుగా తవ్వేస్తున్నారు. ఇదంతా ఓ ప్రజాప్రతినిఽధి కనుసన్నల్లో సాగుతోంది. అనుమతి లేకుండా ఈ క్వారీని కొనసాగిస్తున్నారు. ఆ విషయం సంబంధిత శాఖ అధికారులకు కూడా తెలుసు. నేషనల్‌ హైవే రోడ్డు నుంచి చూసినా ఈ అక్రమ క్వారీ స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో వరుసగా కథనాలొచ్చాయి. వీటిపై ఆ శాఖ అధికారులు స్పందించినట్టు నటించి మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది.

దోచేద్దాం..దాచేద్దాం!

కూటమి అధికారంలోకి రావడంతో అందరి కన్నూ ఆదాయంపై పడింది. తొలుత వర్కులపై పడ్డారు. అవి పార్టీలో పట్టున్న నాయకులే దక్కించుకోవడంతో అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ఇందులో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న క్వారీ తవ్వకాలపై కన్నేశారు. పార్టీ కోసం కష్టపడిన వారు, సీనియర్లందరూ అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ప్రధానంగా కూటమిలో కొత్త ముఖాలు మాత్రమే చక్రం తిప్పుతున్నాయి. వీరంతా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి అక్రమ సంపాదనలో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా మైనింగ్‌ మాఫియాలోకి దిగి కోట్లకు పడగలెత్తుతున్నారు.

కొండలు కరిగించి.. కోట్లు మింగేసి

కూటమి అధికారంలోకి వచ్చాక కొత్తగా తెరపై కనిపిస్తున్న కూటమి నేతలు మైనింగ్‌ మత్తులో పడిపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులను బుట్టలో వేసుకుని అక్రమ క్వారీలతో కోట్లు కొల్లగొడుతున్నారు. సమీప గ్రామాల ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఇంతజరుగుతున్నా ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

దొంగబిల్లుల సంగతేంటి?

రాయల్టీ అధికారిక వసూళ్లతోపాటు కూటమి నేతలు బెదిరించి యూనియన్‌ పేరుతో దొంగ బిల్లులు ఇస్తూ.. కాసులు దోచేస్తున్నారు. నెలనెలా కోట్లు కొల్లగొడుతూ గుట్టు చప్పుడు కాకుండా దొంగ బిల్లుల వ్యవహరాన్ని నడిపిస్తున్నారు. ఈ వ్యవహరం బయటకు రావడంతో దొంగ బిల్లులను నొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. ఇది అధిష్టానం వరకు వెళ్లడంతో పార్టీలోని సీనియర్లతో పాటు వివిధ శాఖల అధికారులు సైతం దొంగ బిల్లుల రారాజుపై ఏళ్లు ఎక్కుపెట్టారు. దీంతో కొంతమందికి గట్టిగా అక్షింతలు పడ్డాయి. ఇంతలో అధికారిక రాయల్టీ వసూళ్ల ప్రక్రియ ముగిసింది.

పట్టుకుంటారా?

అక్రమ క్వారీలు, తరలింపులు దర్జాగా సాగుతున్నా మైనింగ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయల్టీ వసూళ్ల పగ్గాలు ఆ శాఖకు అప్పగించినా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వెళ్లి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ క్వారీలు, తరలింపులను కట్టడి చేసేందుకు సాహసం చేయడం లేదని, మైనింగ్‌ మాఫియాకు భయపడి వారు మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు కార్యాలయంలోని ఓ అధికారి సహకారం, ఆయనిచ్చే సలహాలతోనే అక్రమ క్వారీల వ్యవహారం పుంజుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోని బడానేతల పేర్లు చెప్పుకుంటూ ఈ దందాకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

బంగారుపాళ్యంలో అక్రమ క్వారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement