తరగతుల రద్దు చెల్లదు | - | Sakshi
Sakshi News home page

తరగతుల రద్దు చెల్లదు

May 31 2025 12:35 AM | Updated on May 31 2025 12:35 AM

తరగతు

తరగతుల రద్దు చెల్లదు

● డీఈఓ, ఆర్జేడీలను వివరణ కోరిన హైకోర్టు ● హాకింగ్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ హఫీజ్‌

కుప్పంరూరల్‌ : హాకింగ్‌ పాఠశాలలో స్టేట్‌ సిలబస్‌కు చెందిన 8, 9, 10 తరగతుల రద్దు విషయంలో న్యాయమే గెలిచిందని కుప్పం హాకింగ్‌ ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, కుప్పం మున్సిపాలిటీ వై ఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు హఫీజ్‌ అన్నారు. గత శుక్రవారం తమ పాఠశాలలో స్టేట్‌ సిలబస్‌కు చెందిన 8, 9,10 తరగతులు రద్దు చేస్తూ డీఈవో ఆదేశాలు ఇచ్చారన్నారు. ఏకపక్షంగా వ్యవహరించిన విషయంపై తాము హైకోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. కోర్టు గురువారం విచారణకు స్వీకరించి ఒకే ఒక్క వాదనలోనే తరగతుల రద్దు విషయం చెల్లదని తేల్చి చెప్పారన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తరగతులు రద్దు చేశారని ఆరోపించారు. జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో తాను చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేయడమే ఇందుకు కారణంగా చెప్పుకొచ్చారు. వారం రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు తమకు ఎంతగానో మద్దతుగా నిలిచారన్నారు. తమకు స్టేట్‌ సిలబస్‌ అనుమతులు ఉన్నా సీబీఎస్‌సీ సిలబస్‌పైనే 1 నుంచి 10 వరకు తరగతులు సాగిస్తున్న విషయం తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని కోరారు.

తరగతుల రద్దు చెల్లదు 1
1/1

తరగతుల రద్దు చెల్లదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement