
సత్తా చాటిన ‘విజయ’నగరం
గొలుగొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో విజయనగరం విజయదుందుభి మోగించింది. అండర్–14 బాల, బాలికల విభాగాల్లో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో ఈ జిల్లా జట్లు ప్రథమ స్థానం సాధించాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామ హైస్కూల్లో ఈ నెల 4న ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. సోమవారం ఫైనల్లో విజయనగరం, గుంటూరు బాలురు జట్లు తలపడ్డాయి. ఇందులో 2 పాయింట్ల తేడాతో విజయనగరం విజేతగా నిలిచింది. అనంతరం బాలికల విభాగంలో విజయనగరం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. విజయనగరం పాయింటు తేడాతో విజేతగా నిలిచింది. విజేతలకు నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు, కృష్ణదేవిపేట పూర్వపు ఎస్‌ఐ తారకేశ్వర్రావు, సాఫ్ట్‌బాల్ నిర్వహణ ప్రతినిధులు రమణ, శ్రీనివాసరావు, సుమంత్‌రెడ్డి, సూర్య దేముడు, సతీష్, భవాని, చంద్రమోహన్ బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని వారు సూచించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికితీసేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం బ్రాడీపేటలో సైన్స్ సంబరాల పోస్టర్లు విడుదల చేశారు. లక్ష్మణరావు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 35 ఏళ్లుగా ఈ సంబరాలను నిర్వహిస్తోందని వివరించారు. ఈ నెల 8న పాఠశాల స్థాయి, నవంబర్ 1న మండల స్థాయి, 23న జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సంబరాల నిర్వహణకు విద్యాశాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, ఎం.ఉదయ్ భాస్కర్, టి.జాన్‌బాబు, జి.వెంకట్రావు, టీఆర్ రమేష్, టీఆర్ చాందిని, కె.శ్రీనివాస్, యు.రాజశేఖర్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో
బాల,బాలికల జట్లకు ప్రథమ స్థానం

సత్తా చాటిన ‘విజయ’నగరం

సత్తా చాటిన ‘విజయ’నగరం