
రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక
అద్దంకి: రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న స్కేటింగ్ పోటీలకు సోమవారం అద్దంకిలో క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని సిరీ వెంచర్‌లో నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సీహెచ్ వెంకటేశ్వర్లు హాజరై అద్దంకి, ఒంగోలు, సింగరాయకొండకు చెందిన 24 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఇందులో 13 మంది అద్దంకి చెందిన వారు ఉన్నారు. వీరంతా రాష్ట్ర స్థాయిలో త్వరలో నిర్వహించనున్న అండర్– 11, అండర్ –14, అండర్– 17 విభాగాల్లో ఆడనున్నట్లు స్కూల్ గేమ్స్ సెక్రటరీ వెల్లడించారు.
అద్దంకి: మండలంలోని చక్రాయపాలెంలో దుండగులు ఓ కౌలు రైతు బెండ తోటను పీకేశారు. గ్రామానికి చెందిన నగేశ్ భూమిని సంతమాగులూరు మండలంలోని కొమ్మాపాడుకు చెందిన కాలేషా మీరావలి నాలుగేళ్ల క్రితం కౌలుకు తీసుకుని ఏటా సాగు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది అందులో బెండ తోట వేశాడు. ప్రస్తుతం అది కాపు దశలో ఉంది. ఈ క్రమంలో సోమవారం కౌలుదారు తోటను చూసుకునేందుకు వెళ్లగా అర ఎకరంలోని బెండ మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు పీకేశారు. దీనిపై మీరావలి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
నాదెండ్ల: సాతులూరులోని రైల్వే ఎరువుల రేక్ పాయింట్‌ను నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు పరిశీలించారు. పల్నాడు జిల్లాకు సీఐఎల్ యూరియా 1620 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం సాతులూరులోని ఆవాస్ గోడౌన్లు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కేటాయించిన ఎరువులు సొసైటీలకు , ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసి రైతులకు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు ఏఓ టి.శ్రీలత, ఏఈఓ జీపీ శ్రీనివాసరావు ఉన్నారు.

రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక