
ప్రకృతి ఆధారిత వ్యవసాయంతో ఆర్థికాభివృద్ధి
● రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్
పాడేరు : ప్రకృతి ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఆర్ధికాభివృద్ధితో పాటు పర్యవరణ పరిరక్షణకు దోహాద పడుతుందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ సూచించారు. మండలంలోని బర్సింగిలో ఆదివారం కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో కలిసి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. గిరిజనులు ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న కాఫీ, పసుపు, కూరగాయ పంటలను పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యుల నుంచి జీవామృతం, ఘన జీవామృతం, వేప కషాయం తయారీ విధానాన్ని తెలుసుకున్నారు.