
మన్యంలో వీకెండ్ జోష్
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతానికి పర్యాటకుల తాకిడి నెలకొంది. విశాఖపట్నం. విజయవాడ,హైదరాబాద్,విజయనగరం తదితర ప్రాంతాలతో పాటు ఒడిశా నుంచి భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. డుడుమ జలపాతం, వ్యూపాయింట్, మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు.
డుంబ్రిగుడ: పమ్రుఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతం అందాలను తిలకించారు. గిరిజన వస్త్రధారణలో అలరించారు. ఫొటోలు తీసుకుని సందడి చేశారు. అనంతరం అరకు పైనరీని సందర్శించారు.
చింతపల్లి: ఆంధ్రా కశ్మీరు లంబసింగికి ఆదివారం పర్యాటకులు అంతంతమాత్రంగానే వచ్చారు. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలను తిలకించారు. ఫొటోలు తీసుకుని ఉత్సాహంగా గడిపారు.

మన్యంలో వీకెండ్ జోష్

మన్యంలో వీకెండ్ జోష్

మన్యంలో వీకెండ్ జోష్