
అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు
ఆశా కార్యకర్తల నియామకంపై సమగ్ర విచారణ
● అర్హులకు న్యాయం చేయాలి
● ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్
పాడేరు : జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల నియామకంలో అన్ని అర్హతలు ఉన్న వారికే పోస్టులను కేటాయించాలని ఏపీ గిరిజన సమాఖ్యా జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ఆశా కార్యకర్తల అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన లేకుండా గతంలో పనిచేసి రిటైర్ అయిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు చెందిన వ్యక్తులను ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. మెరిట్‌తో సంబంధం లేనప్పుడు నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేస్తున్నారన్నారు. ఆశా కార్యకర్తల నియామకాల్లో పలు అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. దీనిపై కలెక్టర్, ఐటీడీఏ పీవోలు సమగ్ర విచారణ జరిపి అర్హులు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో అర్హత ఉండి ఉద్యోగం రాని అభ్యర్థులతో ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
యువకులను రక్షించిన లైఫ్‌గార్డ్స్
ఏయూక్యాంపస్: ఆర్కే బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను పోలీసులు, లైఫ్‌గార్డులు రక్షించారు. మింది ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు బీచ్‌కు వచ్చి సముద్ర స్నానం చేస్తుండగా.. వారిలో కిలారి సిద్ధు, అకిరి చరణ్ తేజ అలల్లో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన మైరెన్ పోలీసుల సమాచారంతో జీవీఎంసీ లైఫ్‌గార్డులు పోలిరాజు, అచ్చన్న రంగంలోకి దిగారు. యువకులిద్దరినీ రక్షించి ఒడ్డుకు చేర్చారు. సిద్ధు ఆరోగ్యం నిలకడగా ఉండగా.. చరణ్ తేజకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆల యంలో ఆదివారం రికార్డు స్థాయిలో నిత్యకల్యాణా లు, స్వర్ణపుష్పార్చన సేవలు వైభవంగా జరిగాయి. చైన్నెకి చెందిన కించిత్కారం ధర్మ సంస్థాపనమ్ ఆధ్వర్యంలో ఏకంగా 125 నిత్యకల్యాణాలు, 125 స్వర్ణ పుష్పార్చనలు నిర్వహించారు. తమిళనాడు నుంచి వచ్చిన ఆ సంస్థకు చెందిన 125 మంది ఉభయదాతలు ఈ సేవల్లో పాల్గొన్నారు. వీరికి అదనంగా మరో 13 మంది ఉభయదాతలు కూడా నిత్యకల్యాణంలో పాల్గొనడంతో.. మొత్తం 138 నిత్య కల్యాణాలు జరిగాయి. ఉభయదాతలతో ఆలయ కల్యాణమండపం కిక్కిరిసిపోయింది. తొలుత ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయదాతలను కల్యాణ మండపంలో కూర్చోబెట్టారు. స్వామి వారి ఉత్సవమూర్తులను శేషతల్పంపై అధిష్టింపజేసి.. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తరశతనామావళి సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతి అందించారు. ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం నిర్వహించారు. విష్వక్సేన పూ జ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో ఈ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. అలాగే సాయంత్రం గరుడసేవ నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. సింహగిరి మాడ వీధిలో స్వామికి పెద్ద ఎత్తున తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యు లు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు పర్యవేక్షించారు. కించిత్కారం ధర్మ సంస్థాపనమ్ నిర్వాహకులు యు.వి.కృష్ణన్ స్వామి సేవల్లో పాల్గొన్నారు.
స్వామి సేవలో తరించిన
తమిళనాడు భక్తులు
125 నిత్య కల్యాణాలు,
125 స్వర్ణపుష్పార్చనలు
108 స్వర్ణ సంపెంగలతో
అష్టోత్తరశతనామావళి
138 మంది ఉభయదాతల భాగస్వామ్యం

అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు

అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు

అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు

అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు