
నూతన ఉపాధ్యాయులకు ఇండక్షన్ శిక్షణ
సబ్బవరం : దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ‘మెగా డీఎస్సీ – 2025’ ద్వారా నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ఇండక్షన్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సుమారు 400 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. శిక్షణలో భాగంగా ఆదివారం ఉపాధ్యాయులకు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శిక్షణ సమర్థవంతంగా జరిగేందుకు పర్యవేక్షక కమిటీలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.