
మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యమని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవజాతి శిశు మరణాల రేటును 10లోపు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే గర్భిణుల ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ ఇఫత్, వినోద్ కుమార్, సీఓ రాజారెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.