
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబా ద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఔ త్సాహికులకు సంబంధించిన ప్రాథమిక సమాచా రం ఇప్పటికే సేకరించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, జిల్లాలో సంస్థాగతంగా పార్టీ ఎంతగానో బలపడిందని తెలిపారు. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు దినేష్ మటోలియా, మయూర్‌చంద్ర, రమేశ్, రాజు, విజయ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌టౌన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 32 మంది అర్జీదారులు రాగా బాధితుల సమస్యలను ఎస్పీ ఓపికగా విన్నారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల వారు నేరుగా 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామ ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని స్టేషన్ల అధికారులు, సీఐలు, డీఎస్పీలతో సో మవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికలకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇదివరకే చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, ఎన్నికలను ప్రభావితం చేసే బహుమతులు రవాణా కాకుండా చూడాలన్నారు. సమస్యలను సృష్టించే వారిని, రౌడీలను, సస్పెక్ట్‌లను బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా అధి కారుల అనుమతులు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, పోతారం శ్రీనివాస్, సీఐలు సునిల్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్