
జాతీయ మహాసభల్లో జిల్లా టీచర్లు
ఆదిలాబాద్‌టౌన్/ఇచ్చోడ: రాజస్థాన్‌లోని జండోలి ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ మహాసభల్లో టీపీయూఎస్ జిల్లా బాధ్యులు సోమవారం పా ల్గొన్నారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షానిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా మహాసభలను చేపడుతున్నారు. ఇందులో జా తీయ నూతన విద్యా విధానం, టెట్ సమస్య పరిష్కారం, పాత పెన్షన్ విధానం అమలు, సర్వీస్ రూల్స్, బడ్జెట్‌లో విద్యకు అధిక ప్రాధాన్యం, దేశ వ్యాప్తంగా ఒకే పీఆర్సీ, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు తదితర అంశాలపై చ ర్చించారు. ఈ మహాసభల్లో టీయూపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునిల్ చౌహాన్, గోపీకృష్ణ, కిరణ్, మనోజ్‌రెడ్డి, జీజాబాయి, సంగీత తదితరులున్నారు.