
ఆమెదే ఆధిపత్యం
ఓట్లు, సీట్లలో అతివలదే హవా జనరల్ స్థానాల్లోనూ పోటీకి అవకాశం స్థానిక ఎన్నికల్లో పెరగనున్న ప్రాతినిధ్యం
కై లాస్‌నగర్: స్థానిక సంస్థల్లో మహిళలకు అగ్రపీఠం దక్కనుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తలరాత మార్చగల శక్తితో పాటు ప్రజాప్రతినిధులుగానూ సత్తా చాటేందుకు ఆమెకు అవకాశం కలగనుంది. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కోటా అమలు చేస్తున్నారు. దీంతో వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ పోటీకి అవకాశం ఉంది. ఫలితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుమెంబర్ వంటి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. తద్వారా అన్ని రంగాల్లో రాణిస్తున్న అతివలు రాజకీయంగానూ ఆధిపత్యం చాటేందుకు తోడ్పడనుంది.
మహిళా ఓటర్లే అధికం..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఇటీవల ఓటరు జాబితా ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 20 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 4,49,981 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో పురుష ఓటర్లు 2,19,652 మంది, మహిళా ఓటర్లు 2,30,313 మంది, ఇతరులు మరో 16 మంది ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 10,661మంది అధికంగా ఉన్నారు. ఉట్నూ ర్ మండలంలో అత్యధిక మంది మహిళా ఓటర్లు ఉండగా జిల్లాలోని సగానికి పైగా మండలాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపోటములను ప్రభాఠి వితం చేసే శక్తి వారికుంది. ఈక్రమంలో రాజకీయ పార్టీలన్నీ వారి మద్దతు కూడగట్టుకునేందుకు య త్నిస్తున్నాయి. వారి అనుగ్రహం ఉంటే గెలుపుఖాయమనే ధీమాతో ముందుకు సాగుతున్నారు.
సీట్లలోనూ వారిదే హవా...
ఓట్ల పరంగానే కాకుండా సీట్లలోనూ మహిళలదే ఆధిపత్యం సాగనుంది. 50 శాతం రిజర్వేషన్ల అమలుతో పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సగం సీట్లు వారికే కేటాయించబడ్డాయి. జెడ్పీటీసీలు పది స్థానాలు మహిళలకు కేటాయించగా మరో పది స్థానాలను జనరల్‌కు కేటాయించారు. అలాగే ఎంపీపీ స్థానాల్లో 8 మహిళలకు, 12 స్థానాలను జనరల్‌గా కేటాయించారు. ఇవే కాదు అటు సర్పంచ్, వార్డుమెంబర్ పదవులను సైతం సగం సీట్లను మహిళలకే రిజర్వ్ చేశారు. ఈ స్థానాలతో పాటు జనరల్‌లోనూ మహిళలు పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయనుండడంతో వారి ప్రాతినిధ్యం పెరగనుంది.
జిల్లాలోని ఓటర్ల వివరాలు
మండలం పురుషులు మహిళలు
ఆదిలాబాద్‌రూరల్ 13,854 14,674
బజార్‌హత్నూర్ 11,687 12,141
బేల 13,825 13,762
భీంపూర్ 9,312 10,166
భోరజ్ 7,302 7,656
బోథ్ 13,022 14,236
ఇచ్చోడ 17,131 18,114
గాదిగూడ 7,695 8,104
గుడిహత్నూర్ 12,361 12,929
ఇంద్రవెల్లి 16,033 16,416
జైనథ్ 9,741 10,253
మావల 2,103 2,283
నార్నూర్ 11,606 11,775
నేరడిగొండ 11,517 12,352
సాత్నాల 5,271 5,421
సిరికొండ 6,431 6,714
సొనాల 5,293 5,511
తలమడుగు 13,481 14,376
తాంసి 6,515 7,267
ఉట్నూర్ 25,472 26,163