
జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఢీకొన్న లారీ
గుడిహత్నూర్: మండలంలోని సీతాగోంది స మీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం ఓ కంటైనర్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మంట లు లేచి ఆ వాహనాలు దగ్ధమయ్యాయి. స్థాని కులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ వైపు నుంచి ఆదిలాబాద్ వైపు జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్ వెనకాలే మరో లారీ వస్తోంది. అయితే కంటైనర్‌ను వెనుక వస్తున్న లారీ వేగంగా ఢీకొని ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో ఘర్షణ ఏర్పడి మంటలు చెలరేగాయి. కంటైనర్‌లో ఉన్న దుస్తులు, ఇతర ఆయుర్వేద మందులు పూర్తి గా దగ్ధమయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు వాహనాల ను అక్క డే వదిలి పారిపోయారు. స్థానికుల సమాచా రంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కంటైనర్ పూర్తి స్థాయిలో దగ్ధమవగా.. లారీ పాక్షికంగా కాలి పోయింది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్థానికులు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
ఇంద్రవెల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చే యాలని ఎంపీ నగేశ్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇందులో పార్టీ నిర్మ ల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, రాజలింగు, బాలాజీ, తుకారాం, రాజేశ్వర్, హనుమంత్‌రావ్, మారుతి, దిలీప్ తదితరులున్నారు.

జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఢీకొన్న లారీ