
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
వ్యవసాయ శాఖ ఏఈవోలకు కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్‌పై ఈనెల 6న అవగాహన కల్పించనున్నాం. అనంతరం అధికారులు మండలాల్లోని రైతులకు తెలియజేస్తారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతే రైతులు పంట దిగుబడిని మార్కెట్‌కు తీసుకురావాలి. దీంతో యార్డులో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అలాగే యాప్‌లో డబ్బులు ఎప్పుడు పడనున్నాయి, జమ అయ్యాయా.. లేదా అనే వివరాలు కూడా తెలుస్తాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈనెల 20 తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది.
– గజానన్, మార్కెటింగ్ ఏడీ, ఆదిలాబాద్