
మహాత్ముడికి ఘన నివాళి
ఆదిలాబాద్‌టౌన్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్ముని చిత్రపటానికి కలెక్టర్ రాజర్షి షా, వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాపూజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీవైఎస్‌వో శ్రీనివాస్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
గొప్ప ఆదర్శవాది గాంధీజీ
ఆదిలాబాద్: అహింసాయుత స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించి దాస్య శృంఖలాల నుంచి భారతమాతకు విముక్తి కల్పించిన గొప్ప ఆదర్శవాది జాతిపిత మహాత్మగాంధి అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే దేశ రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాసీ్త్ర జయంతి సందర్భంగా ఆయన చిత్రానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ కార్యాలయంలో జక్కుల శ్రీనివాస్ గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

మహాత్ముడికి ఘన నివాళి