
గోపాలమిత్రల సమస్యలు పరిష్కరించాలని వినతి
బోథ్: గోపాలమిత్రల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి వారు వినతిపత్రం అందించారు. తమను పశుసంవర్ధక శాఖలో ఉద్యోగులుగా గుర్తించి, రూ.24వేల వేతనం అందివ్వాలన్నారు. శాఖలో ఉన్న ఆఫీస్ సబార్టినేట్‌గా గోపాలమిత్రలను నియమించాలని కోరారు. ప్రమాదబీమా, ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు ఏప్రిల్ నెల నుంచి జీతాలు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి గోపాలమిత్రల సమస్యలను తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపాలమిత్రలు రాజు, గోకుల్ జాదవ్, ఆశన్న, గంగన్న, జంగు పాల్గొన్నారు.
విధుల్లో చేరిన విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్
బజార్‌హత్నూర్: మండల విద్యుత్ శాఖ సబ్‌ఇంజినీర్ గుండేటి రవి కుమార్ శుక్రవారం ఇచ్చోడ విద్యుత్ శాఖ ఏడీఈ లక్ష్మణ్‌కు జాయినింగ్ రిపోర్టు అందజేసి మండల విద్యుత్ శాఖ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఆయన గత సంవత్సరం డిప్యూటేషన్‌పై మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. ఇచ్చోడ, బజార్‌హత్నూర్ విద్యుత్ శాఖ ఏఈలు రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

గోపాలమిత్రల సమస్యలు పరిష్కరించాలని వినతి