
పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికలు
కై లాస్‌నగర్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఎన్నికల నిర్వహణ పై అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతిని ధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినందున ఓటర్లను ప్రభా వితం చేసే ప్రచార అంశాలను వెంటనే తొలగించాలన్నారు. మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు మూడు విడతల్లో ఉంటాయని పేర్కొన్నారు. మద్యం, డబ్బు కట్టడికి ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటుతో పా టు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలను నియమిస్తున్నట్లు తెలి పారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లవద్దని, పట్టుబడితే అ నగదు సీజ్ చేస్తామని పేర్కొన్నారు. పోటీచేసే అభ్యర్థులు ప్రచార సభలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకో వా లన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఆర్డీవో, సబ్ కలెక్టర్ నుంచి, సర్పంచ్ అభ్యర్థులు సంబంధిత తహసీల్దార్ ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా,ఆర్డీవో స్రవంతి పాల్గొన్నారు.
దుర్గా మాతా ఆలయంలో కలెక్టర్ పూజలు
ఆదిలాబాద్‌రూరల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భా గంగా మావల మండలం దుర్గానగర్‌లో గల దుర్గా మాతా ఆలయంలో కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు.