
బాధితులకు భరోసా కల్పించాలి
కైలాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలను సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేస్తూ సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, కలెక్టరేట్ ఏవో వర్ణ, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.