
‘కొండా’ సేవలు చిరస్మరణీయం
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ వేడుకలను జిల్లా కేంద్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో శనివారం అధికారికంగా నిర్వహించారు. ఉయ్యాల పాటలు హోరెత్తాయి. ఎస్టీయూ భవన్‌లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ అని పేర్కొన్నారు. ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అసిస్టెంట్ కమిషనర్ వై.హిమశ్రీ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూగార్డెన్‌లో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ రాజర్షి షా హాజరై బతుకమ్మలకు పూజలు చేశారు. కోలాటమాడి సందడి చేశారు. ఇందులో డీఎఫ్‌వో ప్రఽశాంత్ బాజీరావు పాటిల్, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్/కైలాస్‌నగర్
ఆదిలాబాద్‌రూరల్: తెలంగాణ ఉద్యమంలో ఆచా ర్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై కొండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీసీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, పద్మశాలి సంఘం నాయకురాలు ఆశమ్మ పాల్గొన్నారు.

‘కొండా’ సేవలు చిరస్మరణీయం