
ఏటీసీలో నైపుణ్యంతో కూడిన శిక్షణ
ఆదిలాబాద్‌టౌన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను శనివారం హైదరాబాద్‌లోని మల్లెపల్లి ఏటీసీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని గ్రంథాలయ చైర్మ న్ మల్లెపూల నర్సయ్య, ఏటీసీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఆధునిక యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, సరికొత్త సాంకేతికత అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ ఉంటుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఏటీసీ పిన్సిపాల్ శ్రీనివాస్, ముత్యం రెడ్డి, ఏటీసీ కేంద్రాల ప్రిన్సిపాళ్లు, ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్‌లోని కుమురంభీం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ప్రారంభించి మాట్లాడా రు. రూ.5 కోట్లతో భవన నిర్మాణం పూర్తికాగా పరికరాలు, యంత్రాలు, ఇతర ఏర్పాట్లకు రూ.35 కోట్లు కేటాయించామన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే ఐటీడీఏ తరఫున సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏటీసీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.