
వీరనారి చాకలి ఐలమ్మ
ఆదిలాబాద్‌రూరల్: వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఐలమ్మ జయంతిని బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అధికా రికంగా నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట గల ఆమె విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివా ళులర్పించారు. అనంతరం మాట్లాడారు. తెలంగా ణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్రను కొనియాడారు. అంతకుముందు బీసీ సంక్షేమ సంఘం, రజక సంఘం నేతలతో పాటు పలు పార్టీల నేతలు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, మాజీమంత్రి జోగు రామన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, శ్రీనివాస్, మనీషా, సుజాత, పాల్గొన్నారు.
తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఐలమ్మ
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ పౌరుషానికి, పోరాటా నికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ శ్రీనివాస్, సీహెచ్ నాగేందర్, ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, కార్యాలయ ఏవో భక్త ప్రహ్లాద్, సూపరింటెండెంట్లు సులోచన, సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.