
‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కై లాస్‌నగర్: ఏఐసీసీ చేపట్టిన ఓట్ చోర్ గద్దీ చోడ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనవాసరెడ్డి అన్నారు. శుక్రవా రం తన క్యాంపు కార్యాలయం నుంచి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో జూమ్ నిర్వహించారు. నూతన ఓటర్ జాబితా లో ఏవైనా దొంగ ఓట్లు నమోదైతే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రాను న్న స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
వృద్ధులకు అండగా ఉంటా..
వద్ధుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ‘కంది’ అన్నారు. పట్టణంలోని వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు.