
తల్లుల సౌకర్యార్థం కియోస్క్
● ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్
ఆదిలాబాద్: పాలిచ్చే తల్లులకు సౌకర్యవంతంగా ఉండేందుకే కియోస్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమ సింగ్ ఠాకూర్ అన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన కియోస్క్‌ను కలెక్టర్ రాజర్షిషాతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా కియోస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే తరఫున కూడా సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. నవజాత శిశువులకు పాలు ఇవ్వడానికి తల్లులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌లోని వెయిటింగ్ గదులను పరిశీలించారు. ఇందులో ఆర్పీఎఫ్ నాందేడ్ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ అమిత్ ప్రకాశ్‌మిశ్రా, డీడబ్ల్యూవో మిల్క, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, యశోద తదితరులు పాల్గొన్నారు.