
స్వతహాగా సన్నద్ధమై డీఎస్పీగా ఎంపికై ..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన సునీల్‌కుమార్ మకారియా–శ్వేత మకారియా దంపతుల కుమార్తె సాక్షి మకారియా గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించింది. జిల్లా కేంద్రంలోని కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్ చైతన్యలో ఇంటర్, ఢిల్లీలోని ఎల్‌ఎస్‌ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఢిల్లీలోనే ఉంటూ పీజీ, బీఏ, ఎంఏ చదివింది. సివిల్స్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఐదుసార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసినా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఉంటూ పరీక్షల కోసం సన్నద్ధమైంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే స్వతహాగా సన్నద్ధమై గ్రూప్–1లో సత్తా చాటింది. 65వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికై ంది.