కల సాకారమైన వేళ | - | Sakshi
Sakshi News home page

కల సాకారమైన వేళ

Sep 26 2025 7:05 AM | Updated on Sep 26 2025 7:05 AM

కల సా

కల సాకారమైన వేళ

● గ్రూప్‌–1లో మెరిసిన జిల్లావాసులు ● పట్టుదలతో లక్ష్యం చేరిన యువత

ఆశయ సాధనకు ఎన్ని ఇబ్బందులొచ్చినా వెన్ను చూపలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వీడలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఇష్టపడి చదివారు. పగలు, రాత్రి పుస్తకాలతో కుస్తీ పట్టారు. చివరికి అనుకున్న లక్ష్యం సాధించారు. జిల్లాకు చెందిన పలువురు అత్యుత్తమ

ర్యాంకులతో గ్రూప్‌–1 ఉద్యోగాలు సాధించారు.

నందినికి ఇది నాలుగో కొలువు

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి కాలనీకి చెందిన జనగం సంతోష్‌–సంగీత దంపతుల ఏకై క సంతానమైన నందిని వైద్యారోగ్యశాఖలో ఏవోగా ఉద్యోగం సాధించింది. పదోతరగతి వరకు జిల్లా కేంద్రంలోని లిటిల్‌స్టార్‌, ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్‌ అకాడమీలో అభ్యసించింది. ఉస్మానియా కళాశాలలో పీజీ పూర్తి చేసింది. ఇదివరకు మున్సిపల్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికై ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో మూడు నెలల పాటు పనిచేసింది. గ్రూప్‌–3 ఉద్యోగానికి ఎంపికై నా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇటీవల ఆమె జేఎల్‌ కొలువు సాధించి నిర్మల్‌ ప్రభుత్వ కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఉద్యోగం చేస్తూనే ఎలాంటి కోచింగ్‌ లేకుండా పరీక్షకు హాజరైన ఆమె తాజాగా గ్రూప్‌–1లో ఉద్యోగం సాధించింది.

ఫైర్‌మన్‌ నుంచి గ్రూప్‌–1 అధికారిగా..

ఆదిలాబాద్‌టౌన్‌: భోరజ్‌ మండలం పిప్పర్‌వాడకు చెందిన రాజీ వ్‌రెడ్డి–లక్ష్మి దంపతుల కుమారుడు శశిధర్‌రెడ్డి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం గ్రూప్‌–1లో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. శశిధర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో ఫైర్‌మన్‌ (కానిస్టేబుల్‌)గా విధులు నిర్వహిస్తున్నాడు. 2017 లో ఈ ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత 2018లో ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌గా, గ్రూప్‌–4లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు సాధించినా ఫైర్‌మన్‌గానే కొనసాగుతున్నాడు. దీంతో ఆయన నాలుగు ఉద్యోగాలు సాధించాడు. శశిధర్‌రెడ్డికి భార్య పల్లవి, ఇద్దరు పిల్ల లు మనస్వి, శ్రీహన్ష్‌ ఉన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరాంరెడ్డి పాఠశాలలో పదో తరగతి, బోధన్‌లో ఇంటర్‌, హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.

ఉపాధ్యాయుడి కొడుకు ఎంపీడీవోగా..

ఇచ్చోడ: మండల కేంద్రంలోని విద్యానగర్‌ కాలనీకి చెందిన ఉయికే శ్రీనివాస్‌ గ్రూప్‌–1లో సత్తా చాటి ఎంపీడీవో ఉద్యోగం సాధించాడు. శ్రీనివాస్‌ తండ్రి సంజీవ్‌ నాగేశ్వర్‌రావు ఐటీడీఏలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్‌ ప్రాథమిక విద్యను మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో, ఇంటర్‌, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు.

కల సాకారమైన వేళ1
1/3

కల సాకారమైన వేళ

కల సాకారమైన వేళ2
2/3

కల సాకారమైన వేళ

కల సాకారమైన వేళ3
3/3

కల సాకారమైన వేళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement