
పంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీవోగా..
ఉట్నూర్‌రూరల్: మండలంలోని కొత్తగూడ చెక్ పోస్టు గ్రామానికి చెందిన తుడుం లవ్‌కుమార్ గ్రూప్–1లో రాణించి ఎంపీడీవోగా ఉద్యోగం సాధించాడు. ఆదిలాబాద్‌లోని గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు, డీఆర్‌డీఏ ద్వారా హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివాడు. బీటెక్‌లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. 2016లో గ్రూప్–2లో విఫలమై, 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఎంిపికయ్యాడు. ప్రస్తుతం నార్నూర్ మండలం మాన్కాపూర్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే 2022 నుంచి గ్రూప్–1 కోసం ప్రయత్నించాడు. 440 మార్కులతో (తెలుగు మీడియం) స్టేట్ 902, ఎస్సీ కేటగిరీలో 88వ ర్యాంక్ సాధించి ఎంపీడీవో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాగా, లవకుమార్ పదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు మరణించారు. భార్య మృణాళిని, మిత్రులు ప్రవీణ్, వెంకటేశ్, రాజు, అన్నయ్య రాజేందర్ ప్రోత్సాహంతో తాను ఈ విజయం సాధించినట్లు లవకుమార్ తెలిపాడు.