
మహిళలపై పెరుగుతున్న వేధింపులు
ఆదిలాబాద్‌టౌన్: రోజురోజుకు మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయని అఖిల భార త శ్రామిక మహిళా కార్యదర్శి పద్మశ్రీ అన్నా రు. జిల్లా కేంద్రంలోని మాధవరావు విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించిన జిల్లా మహిళా సదస్సులో ఆమె మాట్లాడారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిపారు. వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశన్న, కిరణ్, వెంకటమ్మ, సురేందర్, గంగమ్మ, జంగుబాయి, పద్మ, పార్వతి, సౌజన్య, అరుణ, మనోజ, స్నేహ, పావని పాల్గొన్నారు.