స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన కల్పించాలి

Sep 25 2025 7:35 AM | Updated on Sep 25 2025 7:35 AM

స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన కల్పించాలి

స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన కల్పించాలి

రైతులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలి కలెక్టర్‌ రాజర్షి షా పత్తి కొనుగోళ్లపై వ్యాపారులు, అధికారులతో సమీక్ష

కై లాస్‌నగర్‌: పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన స్లాట్‌ బుకింగ్‌ విధానంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ఈ సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యా పారులు, సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. వ్యాపారులు, అధికారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, కపస్‌ కిసాన్‌ యాప్‌ను రైతులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని స్వతహాగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏవోలు, ఏఈవోలదేనన్నారు. క్రాప్‌ బుకింగ్‌ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చేనెల 10వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 4,31,042 ఎకరాల్లో పత్తి సాగవుతుందని, సుమారు 33.47లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందన్నారు. ఈ మేరకు 36 జిన్నింగ్‌ కేంద్రాల్లో 11 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110తో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొనుగోళ్లకు సంబంధించి గ్రామాలు, తేదీల వారీగా ప్రత్యేక షెడ్యూల్‌ సిద్ధం చేయాలని డీఏవోను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్‌ యా ర్డులు, జిన్నింగ్‌ ఫ్యాక్టరీలలో ఎలక్ట్రానిక్‌ కాంటాల ను పరిశీలించి సిద్ధం చేయాలని లీగల్‌ మెట్రాలజీ అధికారులకు సూచించారు. విద్యుత్‌, అగ్నిమాపక శాఖ అధికారులు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌, ట్రెయి నీ కలెక్టర్‌ సలోని, డీఎస్పీ జీవన్‌రెడ్డి, మార్కెటింగ్‌ అధికారి గజానంద్‌, డీఏవో శ్రీధర్‌ స్వామి, టెక్నికల్‌ ఏవో కె.శివకుమార్‌, ట్రాన్స్‌ కో ఎస్‌ఈ జేఆర్‌ చౌహన్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తేనే రో డ్డు ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిషేధం అంశంపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైవింగ్‌ చేసేవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విద్యాసంస్థల్లో రోడ్‌ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హెల్మెట్‌, సీట్‌ బెల్టు ప్రాధాన్యత వివరించాలని పేర్కొన్నారు. మద్యం సేవించి, అతివేగంతో వాహనాలు నడపొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లా కేంద్రంలోని రహదారులపై పలుచోట్ల స్పీడ్‌ బ్రేకర్లు, సైన్‌ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement