
క్యూలో ‘పట్టా’
ఈ సీజన్‌లో రైతులకు యూరియా ఇక్కట్లు తప్పడం లేదు. భోరజ్ సహకార సంఘ కార్యాలయం వద్ద బుధవారం వేకువజాము నుంచే బారులు తీరారు. గంటల తరబడి క్యూలో నిలబడ లేక తమవంతుగా పట్టా పాస్‌బుక్‌లను ఉంచారు. 444 బ్యాగ్‌లను పంపిణీ చేసినట్టు ఏవో అష్రఫ్ తెలిపారు. జైనథ్‌లోని గ్రోమోర్ షాపు ఎదుట రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. టోకెన్లు అందించి 400 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఏవో పూజ తెలిపారు. కాగా, పలువురి రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు వారిని సముదాయించారు. అలాగే తలమడుగు మండలంలోని బరంపూర్, సుంకిడి గ్రామాల సహకార సంఘ గోదాంల వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కో గ్రామంలో 444 బస్తాల చొప్పున పంపిణీ చేసినట్లు ఏవో ప్రమోద్‌రెడ్డి తెలిపారు. – సాత్నాల/జైనథ్/తలమడుగు

క్యూలో ‘పట్టా’

క్యూలో ‘పట్టా’