
వారం రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని బీఫ్ మార్కెట్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ బుధవారం సందర్శించారు. రూ.50లక్షల వ్యయంతో నాలుగేళ్ల క్రితం చేపట్టిన మార్కెట్ నిర్మాణ, అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉ న్నాయని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ఇటీవల కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ బీఫ్ మార్కెట్‌ను సందర్శించి అసంపూర్తి పనులను పరిశీలించారు. వ్యాపారుల ఇ బ్బందులను రంజానీ వివరించగా.. స్పందించిన అదనపు కలెక్టర్ వారం రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలి పారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, డీఈ సందీప్ ఉన్నారు.