
భలే పూల గిరాకీ
నిర్మల్‌టౌన్: పూలను పూజించే ఏకై క పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు మహిళలు బతుకమ్మ ఆడి పాడుతారు. ఈ క్రమంలో పూలకు భారీ డిమాండ్ పెరిగింది. స్థానిక బస్టాండ్, ఓల్డ్ బస్టాండ్, బోయివాడ హనుమాన్ టెంపుల్, మున్సిపల్ కాంప్లెక్స్‌లో గల పూల సెంటర్లు మహిళలతో సందడిగా మారాయి. బంతిపూలు కిలోకు రూ.60 నుంచి రూ.80, చామంతి పూలు రూ.300 నుంచి రూ.400, గులాబీలు రూ.300, లిల్లీ రూ.400, మల్లెపూలు రూ.800 వరకు ధర పలుకుతున్నాయి. మహారాష్ట్ర, హైదరాబాద్, కర్ణాటక నుంచి నిర్మల్‌కు పూలు దిగుమతి అవుతున్నాయి.
80 కిలోలు అమ్ముతున్న
బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా పూల గిరాకీ ఎక్కువగా ఉంది. రోజుకు 80 కిలోల బంతిపూలు, 50 కిలోల చామంతిపూలు అమ్ముతున్నా. నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల వారు సైతం బతుకమ్మలకు బంతి, చామంతులను కొనుగోలు చేయడానికి వస్తున్నారు.
– సురేష్, ఫ్లవర్ మర్చంట్, బోయివాడ
సీజన్ బాగుంది
ఈ బతుకమ్మ పండుగ సీజన్‌లో పూల గిరాకీ బాగుంది. రోజుకు క్వింటల్ బంతిపూలు, 80 కిలోల చామంతి, 20 కిలోల మల్లెపూలు అమ్ముతున్నా. నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల వారు సైతం నా వద్దే పూలు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి 20 శాతం గిరాకీ ఎక్కువే ఉంది. – జీ.నరేశ్,
మున్సిపల్ కాంప్లెక్స్ ఫ్లవర్ మర్చంట్

భలే పూల గిరాకీ

భలే పూల గిరాకీ