
వీధి వ్యాపారులకు మళ్లీ రుణాలు
కై లాస్‌నగర్: పట్టణ పరిధిలోని వీధి వ్యాపారులకు మళ్లీ రుణాలు అందజేయాలని కేంద్ర ప్ర భుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు సెప్టెంబర్ 17నుంచి మున్సిపల్ పరిధిలో లోక కల్యాణ మేళా పేరిట అవగాహ న సదస్సులకు శ్రీకారం చుట్టారు. అక్టోబ ర్ 2 వరకు నిర్వహించి 50 మందికి రుణాలందించేలా చర్యలు చేపడుతున్నారు. కరోనా తర్వాత పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు రూ.10వేలు, రూ.20వేలు, రూ.50వేల వరకు మూడు విడతల్లో అందించారు. అయితే గతేడాది డిసెంబర్ నుంచి ఈ పథకాన్ని కేంద్రం నిలిపివేసింది. దీంతో దరఖాస్తు చేసుకున్న చాలామంది నిరాశకు గురయ్యారు. తాజాగా లోక కల్యాణ మేళా పేరిట తిరిగి వారికి రుణా లు అందించాలని కేంద్రం సంకల్పించింది. ఈ మేరకు మెప్మా సిబ్బంది పట్టణంలోని వీధి వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూ పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. గతంతో పో ల్చితే రుణ పరిమితి పెంచారు. ఈ సారి రూ. 15వేలు, రూ.25వేలు, రూ.50వేలను అందించనున్నారు. రుణ మంజూరుతో పాటు డిజిట ల్ చెల్లింపులపై శిక్షణ ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కానర్లను అందిస్తున్నారు.