
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
ఆదిలాబాద్‌టౌన్/ఆదిలాబాద్‌రూరల్: ఆర్టికల్ 34 ప్రకారం చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబి తా నుంచి తొలగించాలని ఆదివాసీ సంఘాల నా యకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ముందుగా రాయిసెంటర్లు, సార్‌మేడీలు, పటేళ్ల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ముత్యాలమ్మ గుడి వద్ద పూ జలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ రూరల్, మావల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. కుమురంభీం చౌక్‌లో భీంకు నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీవో స్రవంతి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ రావాలంటూ పట్టుబట్టారు. వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా రావడంతో ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, 40 ఏళ్లుగా లంబాడాలు ఆదివాసీల రిజర్వేషన్లు పొందుతూ ఉద్యోగ, ఉపాధి, వైద్య, విద్యలో ఆదివాసీల అవకాశాలను కొల్లగొడుతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు లంబాడాలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గణేశ్, విశ్వంబర్, జంగుపటేల్, సోనేరావు, వెంకటేశ్, తానాజీ తదితరులు పాల్గొన్నారు.