
పోలీస్ గ్రీవెన్స్‌కు 43 ఫిర్యాదులు
ఆదిలాబాద్‌టౌన్: పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ వారం 43 ఫిర్యాదుదారులు అందినట్లు వెల్లడించారు. ఇందులో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతులు లేవు
నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా దుర్గామాత, శారదాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మండపాల వద్ద ప్రత్యేకంగా మహిళా సిబ్బంది, షీటీంతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో ప్రత్యేకంగా క్లస్టర్, సెక్టార్ స్థాయిగా విభజించి బందోబస్తు ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పండుగకు సొంత ఊర్లకు వెళ్లేవారు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. విలువైన సామగ్రి, వస్తువులను ఇంట్లో ఉంచకుండా చూడాలని పేర్కొన్నారు. నిమజ్జన ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా అందరూ సహకరించాలని కోరారు.