
నిండుకుండలా ‘మత్తడివాగు’
తాంసి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వడ్డాడి స మీపంలోని మత్తడివాగు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరింది. ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పు డు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. వారంరో జులుగా వర్షాలు తగ్గుముఖం పట్టగా ప్రాజెక్ట్‌లోకి ఇ న్‌ఫ్లో తగ్గింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి మట్టం ఉండగా ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ప్రా జెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 277.40 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంది. నిండుకుండలా మారడంతో పలువురు పర్యాటకులు వచ్చి ప్రాజెక్ట్ అందాలను తిలకిస్తున్నారు.