
కలెక్టరేట్‌లో లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
ఆదిలాబాద్‌రూరల్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ జీ వర్ధంతిని ఆదివారం కలెక్టరేట్‌లోని బాపూజీ చౌక్‌లో ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి కలెక్టర్ రాజర్షి షా పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర గు రించి వివరించారు. బాపూజీ స్ఫూర్తిని కొనసాగి స్తూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించా రు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం బాపూజీ పదవులను కూడా వదులుకున్నారని గుర్తు చేశారు. అలాగే, పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పా ల్గొని లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పద్మశాలీ సంఘం నాయకులు మంచికట్ల ఆశమ్మ, బేత రమేశ్, జిట్ట రమేశ్, బొ మ్మకంటి రమేశ్, దాసరి రమేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు పాల్గొన్నారు.