
డిగ్రీ లెక్చరర్‌కు డాక్టరేట్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ తిరుకోవెల మంజులకు డాక్టరేట్ లభించింది. ఆమె శాతవాహన విశ్వవిద్యాలయంలో ‘సింథసిస్ ఆఫ్ పైరన్ అండ్ పైపిరిడిన్ డెరివేటివ్స్ యూసింగ్ నావెల్ మెథలాడజీ’ అనే అంశంపై పరిశోధన చేశారు. శాతవాహన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ జయంతి పర్యవేక్షణకు గాను డాక్టరేట్ పట్టా అందజేసినట్లు ఆమె వివరించారు. పరిశోధన సమయంలో అంతర్జాతీయ స్థాయిలో పలు పత్రాలు అందజేశారు. తన కుటుంబ సభ్యుల సహకారంతో డాక్టరేట్ లభించిందని మంజుల తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ సంగీత, లెక్చరర్లు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.