
కోర్టులో పిటిషన్ వేశాం
టెట్ విషయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాం. ఏదైన చట్టం అమలైన రోజు నుంచి నిబంధనలు వర్తించాలి. 2010 కంటే ముందు ఉపాధ్యాయులకు టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీపిటిషన్ వేయాలి. ప్రమోషన్లు పొందే ఉపాధ్యాయులకు మాత్రం టెట్ అర్హత పెట్టడం సరైందే. కోర్టు తీర్పుతో చాలామంది ఉపాధ్యాయులు భయాందోళనలో ఉన్నారు. – వెంకట్,
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మినహాయింపు ఇవ్వాలి
మానవతాదృక్పథంతో ఆలోచించి టెట్ రాకముందు వృత్తిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. ఈ విషయంలో గందరగోళం నెలకొని మానసిక వేదనకు గురవుతున్నారు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చినట్లుగానే విద్యాహక్కు చట్టం అమలుకంటే ముందు విధుల్లో చేరిన వారికీ మినహాయింపు ఇవ్వాలి.
– కొమ్ము కృష్ణకుమార్,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు

కోర్టులో పిటిషన్ వేశాం