
నాటుసారా స్థావరాలపై దాడులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రొహిబిషన్, ఎకై ్సజ్, మంచిర్యాల ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం నాటుసారా స్థావరాలపై ఆకస్మిక దాడులు చేశారు. బెల్లంపల్లి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మందమర్రి మండలం పులిమడుగు, కాసిపేట మండలం ధర్మారావుపేట, మామిడి గూడెం గ్రామాల్లోని నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. పులిమడుగు గ్రామానికి చెందిన బానోత్ అంబ్రియా, బూక్యా దేవి, ధర్మారావుపేట గ్రామానికి చెందిన బానోత్ లక్ష్మి, బానోత్ రాజు వద్ద 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. ఈమేరకు నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు బెల్లంపల్లి ప్రొహిబిషన్, ఎక్సెజ్ సీఐ ఇంద్రప్రసాద్ తెలిపారు. దాడుల్లో మంచిర్యాల టాస్క్‌ఫోర్స్ సీఐ ఎస్.సమ్మయ్య, ఎస్సైలు శారద, వెంకటేశ్, సిబ్బంది అశోక్, దినేశ్, గణేశ్, శిరీష, సాగర్, రమేశ్, ప్రశాంత్, కవిత పాల్గొన్నారు.