కౌంటీలకు కోహ్లి దూరం! | Virat Kohli likely to miss County stint due to slipped disc | Sakshi
Sakshi News home page

కౌంటీలకు కోహ్లి దూరం!

May 24 2018 11:59 AM | Updated on Jul 10 2019 7:55 PM

Virat Kohli likely to miss County stint due to slipped disc - Sakshi

ముంబై: త్వరలో కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లండ్‌కు పయనం కావాల్సి ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన ప్రయాణాన్ని రద్దు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో కోహ్లి గాయపడ్డాడనే వార్తల నేపథ్యంలో  అతను కౌంటీల్లో పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించకపోయినా, వైద్యుల సలహా మేరకు కోహ్లి కౌంటీలకు దూరం కావడం దాదాపు ఖాయంగానే కనబడుతోంది.

ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన వెంటనే ఇంగ్లిష్‌ కౌంటీలు ఆడేందుకు ఇంగ్లండ్‌కు పయనం కావాలని కోహ్లి ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు నెలలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో తన ప్రిపరేషన్‌లో భాగంగా అక్కడ కౌంటీల్లో ఆడేందుకు కోహ్లి మొగ్గుచూపాడు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నుంచి కూడా కోహ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అయితే తాజాగా గాయపడ్డాడనే వార్తల నేపథ్యంలో తన ఇంగ్లండ్‌ పర్యటనకు కోహ్లి ఫుల్‌స్టాప్‌ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement